దశలవారిగా రోడ్ల అభివృద్ది..!
– డ్రైనేజీల గతి మార్చేందుకు కృషి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– రూ. 2.08 కోట్లతో మల్రెడ్డిపల్లి రోడ్డు పనులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని రోడ్లను దశలవారిగా అభివృద్ధి పరచడమే కాకుండా పట్టణంలోని డ్రైనేజీల దుర్గతిని మార్చేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లి నుంచి శివాజీ చౌరస్తా వరకు ఎస్డీఎఫ్ నుంచి రూ. 2.08 కోట్ల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు. వార్డు కౌన్సిలర్లు సాహు శ్రీలత లక్ష్మీకాంత్, బాలప్ప, ప్రభాకర్ గౌడ్లతో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో హామి ఇచ్చిన విధంగా తాండూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద వహించడం జరుగుతుందన్నారు.
దశల వారిగా అన్ని వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. దీంతో పాటు పలు వార్డుల్లో అస్తవ్యస్థంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ గతి మార్చేందుకు దృష్టిసారిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని వార్డుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోడీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు డా.సంపత్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

