పాముకాటుతో బాలిక మృతి..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పాముకాటుతో బాలిక మృతి..!
– యాలాల మండలంలో ఘటన
– కుటుంబంలో విషాధం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ బాలికను పాముకాటు వేయడంతో మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి యాలాల మండలం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గంగసాగర్ గ్రామానికి చెందిన ఓ ఆరేళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుంది. రాత్రి వేళ పక్కనే ఉన్న సంచుల వద్ద మాటు వేసిన పాము బాలికను కాటువేసింది. అయితే బాలిక తనకు ఏదో గుచ్చుకుందని, రక్తం వస్తుందని తల్లిదండ్రులకు తెలిపింది. నీళ్లు తాగిన కొద్ది సేపటికి బాలిక అపస్మారక స్థితిలోకి జారుకుని మరణించింది. బాలిక మృతికి పాముకాటే కారణమని గుర్తించి.. స్థానికులు పామును పట్టి చంపేశారు. కాగా తమ కూతురు కళ్లముందే చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ సంఘటన వారి కుటుంబంలో విషాధం నింపింది.

ఇదికూడా చదవండి…

సాంకేతిక శిక్షణతో యువతకు మేలు..!