అప్పుల బాధతతో..!
– దంపతుల బలవన్మరణం
– పురుగులు మందు సేవించి ఆత్మహత్య
– యాలాల మండలంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : అప్పుల వల్ల ఆర్థిక భారం మోయలేక ఓ దంపతులు పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం యాలాల మండలం నాగసారం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాసుల యాదప్ప(42), భార్య మాసుల జ్యోతి(38) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కూతురు శ్రీలత(20), కుమారుడు సందీప్(12)లు ఉన్నారు. గత రెండేళ్ల క్రితం అప్పులు చేసి కూతురు వివాహం జరిపించారు. మరోవైపు వ్యవసాయం కోసం కొంత అప్పులు చేశారు. అప్పుల బాధ, ఆర్థిక భారాలు మోయలేక మనోవేధనకు గురయ్యారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం గుర్తుతెలియని పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుతున్నట్లు తెలిపారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
ఇదికూడా చదవండి….

