హస్తం పాలన అస్తవ్యస్థం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హస్తం పాలన అస్తవ్యస్థం..!
– ఏడాది కాలంలో అభివృద్ధి శూన్యం
– సంక్షేమ పథకాల అమలులో విఫలం
– బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన అస్తవ్యస్థంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం విమర్శించారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విమర్శలు చేశారు. ఆరు గ్యారెంటీలు ఆగమ్యగోచరంగా మారాయన్నారు. రైతుబంధు, రైతు రుణమాఫీ పథకాల అమలులో విఫలమయ్యిందన్నారు. రైతులకు సరైన న్యాయం జరగడం లేదన్నారు.

రైతుబంధు విషయంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కళ్యాణ లక్ష్మీలో తులం బంగారం రాలేదని, మహిళలకు భృతి అందడం లేదని అన్నారు. ఇక తాండూరు నియోజకవర్గంలో అభివృద్ది ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారిందన్నారు. రోడ్ల దుస్తితి అద్వాన్నంగా మారిందని విమర్శించారు. తాండూరు – వికారాబాద్‌ రోడ్డు, బైపాస్ రోడ్డు, నేషనల్ హైవే రోడ్డు విషయంలో దృష్టిసారిడం లేదని అన్నారు. విజయోత్సవాలు, రైతు పండగలు అంటూ ప్రజలను మభ్యపెడుతుందని.. ప్రజాపాలన.. ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

ఇదికూడా చదవండి…

కార్తీక శోభ..!