ఏటీఎం లూటీకి స్కెచ్ వేసిన దొంగలు
– ధ్వంసం చేస్తుంగా మోగిన అలారం
– పరారైన గుర్తుతెలియని వ్యక్తులు
– సీసీ పుటేజీలో వీడియోలు రికార్డు
– కరణ్ కోట్ గ్రామంలో ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ముఖానికి మాస్కులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం లూటీకి స్కెచ్ వేశారు. కరెంటు కనెక్షన్ కట్ చేసి చోరీ చేసేందుకు యత్నించారు. వెంటనే అలారం మోగడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ పుటేజీలో రికార్డు అయ్యాయి. ఈ సంఘటన కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కరణ్ కోట్ గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి లోనికి ప్రవేశించారు. ఏటీఎం కరెంట్ కనెక్షన్ కట్ చేసి గడ్డపారలతో మిషన్ ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. అప్పటికే అలారం మోగడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. బ్యాంకు అధికారులకు నోటిఫికేషన్ రావడంతో వారు కరణ్ కోట్ పోలీసులకు సమాచారం అందించారు.
అప్పటికే గుర్తుతెలియని దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. కాని ఏటీఎంలో ఎలాంటి డబ్బులు చోరీకి గురికాలేదని పోలీసులు వెల్లడించారు. అయితే చోరీ యత్నానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. దొంగలకు సంబంధించిన ఆచూకీ తెలిస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

