అప్పులున్నా.. సంక్షేమాన్ని ఆపలేం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అప్పులున్నా.. సంక్షేమాన్ని ఆపలేం..!
– ఏడాదిలో సంక్షేమానికి రూ.61వేల కోట్ల ఖర్చు
– బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో ఆర్థిక సంక్షోభం
– వాళ్లు చేసిన అప్పులకు కాంగ్రెస్ వడ్డి కడుతోంది
– అందుకే పథకాల అమలులో జాప్యం
– వచ్చే మార్చి నాటికి ప్రతి ఇంటికి పథకాలు
– తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
– తాండూరులో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు
– మాతా శిశు ఆసుపత్రిలో ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ప్రారంభం
– మహిళ సంఘాలకు రూ.23 కోట్ల రుణాల చెక్కు అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో ప్రభుత్వానికి అప్పులు ఉన్నా ప్రజల కోసం సంక్షేమాన్ని ఆపకుండా ముందకు సాగుతుందని తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డితో కలిసి విజయోత్సవాలలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో ఇందిరా మహిళ శక్తి ద్వారా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ప్రారంభించారు. అదేవిధంగా కోడంగల్ రోడ్డు మార్గంలోని ఎస్వీఆర్ ఫం క్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పలు మహిళలు ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలను తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం తాండూరు పట్టణంలోని 35 మహిళ సంఘాలకు మంజూరు చేసిన రూ. 23.92 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రసంగిస్తూ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందజేస్తే పదేళ్లు రాష్ట్ర వనరులను కొల్లగొట్టిందని విమర్శించారు. రెండు సార్లు అవకాశం ఇస్తే కుటుంబ పాలనతో 7లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ చేసిన అప్పులకు వేల కోట్లు అప్పులు కడుతుందన్నారు. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక సంక్షోభం వల్ల కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలలో ఆలస్యం జరుగుతుందన్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఫించన్లు, మహాలక్ష్మీ ఉచిత ప్రయాణం. గృహజ్యోతి, గ్యాస్ సబ్సీడీ, రైతు భరోసా, రైతురుణమాఫీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం. విద్యారంగ అభివృద్ధికి ఏడాది పాలనలో రూ.61 వేల కోట్లను ఖర్చు చేసిందన్నారు. రైతురుణమాఫీ కాని రైతులకు రుణమాఫీతో పాటు రైతు భరోసాపై వారంలోపు ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. గత ప్రభుత్వం నోటీఫికేషన్లు ఇచ్చి చేతుల దులుపుకుంటే కాంగ్రెస్ ఏడాదిలో 55వేల 140 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. సీఎంఆర్ఎఫ్ కింద రూ. 890 కోట్లు మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వ ప్రభుత్వం చేసిన ఆర్థిక సంక్షోభంను తట్టుకుంటూ సంక్షేమాన్ని ఆపకుండా అమలు చె స్తుందని అన్నారు. వచ్చే యేడాది మార్చి నాటికి ఇంటింటికి ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

మహిళ శక్తి ద్వారా మహిళ సంఘాల్లోకి మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం సంకల్పించి రుణాలు మంజూరు చేస్తుందన్నారు. చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సీఎం, స్పీకర్ సహాకారంతో నిధులు మంజూరు కావడం జరుగుతుందన్నారు. తాండూరు, పరిగి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీఎం, స్పీకర్ స హాకారంతో జిల్లా అభివృద్ధికి సహాకారం అందిస్తామన్నారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. తాండూరు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కొ ట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, బోయరవి, బొంబీనా, భీంసింగ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, తహసీల్దార్ తారాసింగ్, ఆర్పీలు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

ప్రతి గుండెను కాపాడాలి..!