ఇంటింటికి ఇంటర్‌నెట్ కనెక్షన్‌..!

టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

ఇంటింటికి ఇంటర్‌నెట్ కనెక్షన్‌..!
– కసరత్తు చేస్తున్న తెలంగాణ సర్కారు
– గ్రామ పంచాయతీల్లో అమలుకు నిర్ణయం
– తక్కువ ధరకే అందుబాటులోకి 

హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది. తక్కువ ధరకే ప్రతి ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్‌ ఇచ్చేందుకు కసరత్తును చేపడుతోంది. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ కనెక్షన్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న టీవీని కంప్యూటర్ మాదిరిగా వినియోగించుకోవచ్చు. దీని ద్వారా టీవీలోనే ప్రత్యేక వెసులబాటును కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 20 ఎంబిబిఎస్ స్పీడ్‌తో రూ. 300లకే ఇంటర్నెట్ కనెక్షన్ అందివ్వనుంది ప్రభుత్వం.

ఇందులో పలు తెలుగు ఓటీటీలు కూడా అందుబాటులో ఉంటాయి. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 94 మండలాలు, 2,096 గ్రామ పంచాయతీల్లో కమర్షియల్‌ సేవలు అందించేందుకు అధికారులు మ్యాప్ రెడీ చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం టి ఫైబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు అత్యంత తక్కువ ధరకు ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

తొలి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని పలు గ్రామాలకు ఈ ట్రయల్ సేవలను అందించనున్నారు…ఈ నెల 8 న సీఎం రేవంత్ రెడ్డి ఈ సేవల్ని ప్రారంభించనున్నారు. వీటితోపాటు 30 వేలకు పైగా ప్రభుత్వ సంస్థలను అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టీ ఫైబర్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

ఇదికూడా చదవండి..

10న సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి