కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కచ్చి ఓవైస్
– అభినందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ తాండూరు నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కచ్చి ఓవైస్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన కచ్చి ఓవైస్ ను కోఆర్డినేటర్ గా నియమించినట్లు అందులో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియామకమైన కచ్చి ఓవైస్ ను అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనని, ప్రతి పక్షాలు చేసే తప్పుడు ఆరోపణలను ఎండగట్టాలని సూచించారు. అదేవిధంగా కచ్చి ఓవైస్ మాట్లాడుతూ తనకు సోషల్ మీడియా కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదికూడా చదవండి..

