జయహో… చత్రపతి శివాజీ మహరాజ్…!

తాండూరు రాజకీయం వికారాబాద్

జయహో… చత్రపతి శివాజీ మహరాజ్…!
– తాండూరు శోభాయాత్రలో దద్దరిల్లిన నినాదాలు
– పురవీదుల్లో శోభాయామానంగా యువకుల శోభాయాత్ర
– ర్యాలీలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– అంబరాన్నంటిన శివాజీ జయంతి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జయహో.. హిందూ మరాట్ చత్రపతి శివాజీ మహరాజ్ అంటూ యువకులు నినాదాలతో తాండూరు పురవీధులు దద్దరిల్లాయి. బుధవారం హిందూ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహరాజ్ 395వ జయంతి వేడుకలు తాండూరులో అంబరాన్నంటే విధంగా జరుపుకున్నారు. శివాజీ జయంతి సందర్భంగా ఆయా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని కాళీకాదేవి ఆలయం నుంచి భారీ శోభాయాత్ర చేపట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైన శోభాయాత్ర శాంత్మహాల్ చౌరస్తా, వినాయక్ చౌక్, ఇందిరాచౌక్, మల్లప్ప మడిగ మీదుగా శివాజీ చౌరస్తా వరకు కొనసాగింది.

ర్యాలీలో యువకులు శివాజీ మహారాజ్కో జై., జై శివాజీ.. జైజై శివాజీ అంటూ నినాదాలు చేశారు. పురవీధుల్లో శోభాయాత్ర శోభాయామానంగా కొనసాగింది. శివాజీ చౌరస్తాలో విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ర్యాలీలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని కాళీకాదేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ర్యాలీలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, బాలప్ప, మాజీ ఫ్లోర్ లీడర్లు అంతారం లలిత, లింగదలి రవికుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ మురళీ గౌడ్, మార్కెట్ కమిటి డైరెక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, మహిళ నాయకురాలు గాజుల మాధవి, హిందూ ఉత్సవ సమితి, భజరంగ్ దళ్, విహెచ్ పీ, యువజన సంఘాల ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రక్తదానం అభినందనీయం..!