హాస్పిటల్‌ టు హోం.. వయా హాస్టల్..!

ఆరోగ్యం క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

హాస్పిటల్‌ టు హోం.. వయా హాస్టల్..!
– డిశ్చార్జ్‌ అయిన వసతి గృహం అమ్మాయిలు
– వెంట తీసుకవెళ్లిన తల్లిదండ్రులు
– ఆసుపత్రిలో మరో ఇద్దరికి చికిత్స
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో అసుపత్రి పాలైన తాండూరు పట్టణం గిరిజన బాలికల వసతిగృహంకు చెందిన 9 మంది అమ్మాయిలు క్షేమంగా కోలుకున్నారు. అందరు ఆరోగ్యంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. పట్టణంలోని సాయిపూర్ లో ఉన్న గిరిజన బాలికల వసతి గృహంలో ఆహారం సరిగ్గా లేక పోయినా తిని అమ్మాయిలు అనారోగ్యం పాలైన సంగతి తెలిసింది. రెండు రోజుల క్రితం హాస్టల్ కు చెందిన 9 మంది అమ్మాయిలను పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు అమ్మాయిలకు చికిత్స అందించారు.

శనివారం రాత్రి మరో ఇద్దరు బాలికలు కూడా మాతా శిశు ఆసుపత్రిలో చేరారు. మొత్తం 11 మంది అమ్మాయిలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రెండు రోజులుగా వైద్యం పొందిన 9 మంది అమ్మాయిలు సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన అమ్మాయిలను తల్లిదండ్రులు వెంట తీసుకెళ్లారు.ఆసుపత్రి నుంచి హాస్టల్‌కు తీసుకెళ్లి.. అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లి మళ్లీ పంపిస్తామని తల్లిదండ్రులు తెలిపారు. మరో ఇద్దరు అమ్మాయిలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వసతి గృహం అమ్మాయిలు ఆరోగ్యంగా కోలుకోవడం పట్ల తల్లిదండ్రులతో పాటు పలువురు ఊరట పొందారు.

ఇదికూడా చదవండి…

గ్రూపు-2 పరీక్ష రాసిన పోలీసులు..!