పర్యాదకు పుడమి విద్యారత్న అవార్డు..!
– పద్మశ్రీ వనజీవి, కంచర్ల చేతుల మీదుగా అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన విద్యావేత్త, భాష్యం కళాశాల కరస్పాండెంట్ పర్యాద రామకృష్ణకు పుడమి విద్యారత్న అవార్డు దక్కింది. ఆదివారం ఖమ్మంలోని ముదిగొండలో పుడమి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పద్మశ్రీ వనజీవి రామయ్య, భక్త రామదాసు 10వ తరం వారసులు కంచర్ల శ్రీనివాస్ చేతుల మీదుగా పర్యాద రామకృష్ణకు పుడవి వి ద్యారత్న అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా పర్యాద రామకృష్ణకు పుడమి విద్యారత్న అవార్డు రావడం పట్ల ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేసి.. శుభాకాంక్షలు తెలిపారు.
ఇదికూడా చదవండి…

