ఆర్యవైశ్యుల ముగ్గుల పోటీ అదుర్స్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్యవైశ్యుల ముగ్గుల పోటీ అదుర్స్..!
– ఉత్సహాంగా పాల్గొన్న మహిళలు
– విజేతలకు నగదు బహుతులు అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు అదుర్స్ అనిపించాయి. ఆదివారం పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో మహిళలు ఉత్సహాంగా పాల్గొన్నారు. అందమైన రంగులలో మహిళలు ముగ్గులు వేశారు. సప్తవర్ణాలతో కూడిన హరివిల్లును నేలకు దించిన రీతిలో ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. అదేవిధంగా శిశువులను కాపాడుకోవాలని, యూటూబ్, ఇన్స్ స్ట్రామ్, ఫేస్ బుక్ వంటి యాప్ లకు బానిసలు కావద్దని అవగాహన కల్పించే ముగ్గులు వేసి ఆలోచింపజేశారు. ఈపోటీలకు మాజీ జెడ్పీటీసీ మలిపేడి మేఘమాల, జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు యాస్కి శిరీషా, వీరశైవ మహిళ సంఘం అధ్యక్షురాలు జొల్లు రోహిణీలు న్యాయ నిర్ణయేతలుగా హాజరై విజేతలను ఎంపిక చేశారు. వారితో పాటు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, శ్రీ వైష్ణవి కిడ్స్ వేర్ అధినేత సతీష్, తాళ్లపల్లి కవిత రాఘవేంద్ర స హాకారంతో విజేతలకు మొదటి ప్రైజ్ ్కు రూ. 5వేలు, రెండో ప్రైజ్ రూ.3వేలు, మూడో ప్రైజ్ రూ.2వేల నగదు బహుమతులు అందజేశారు. అదేవిధంగా వాసవీ మహిళ సంఘం అధ్వర్యంలో 5 మందికి ప్రోత్సహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముగ్గులు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. అదేవిధంగా ముగ్గులు వేయడంలో శాస్త్రీయత దాగి ఉందని, మహిళలు ముగ్గులు వేయడం ఎంతో ఉపకరిస్తుందన్నారు. మహిళలు ముగ్గులు వేయడమే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాసవీ మహిళ సంఘం అధ్యక్షులు కోట్రిక నాగలక్ష్మీ, ప్రధాన కార్యదర్శి మంకాల స్వప్న, కోశాధికారి సింగంశెట్టి శోభ, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రైల్వే శాఖలో ఉద్యోగాలు..!