అధ్యాపకుల సంఘం వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా శ్రీనివాస్ గౌడ్
– తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్‌లో తాండూరు కళాశాల అధ్యాపకుడుకు చోటు
– అభినందనలు తెలిపిన నాయకులు, అభిమానులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్‌లో తాండూరు ప్రభుత్వ కాలేజీ అద్యాపకులు శ్రీనివాస్ గౌడ్ వికారాబాద్ జిల్లా ఇంంచార్జ్‌గా నియామకం అయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీనివాస్ గౌడ్ ఇంగ్లీష్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అద్యాపక బోధనతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్‌లో వికారాబాద్ జిల్లా అద్యాపకుల సంఘం జిల్లా ఇంచార్జ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఇన్చార్జిగా నియమించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అధ్యాపకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు, రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్‌లకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న స్కాలర్షిప్లు , తదితర ప్రోత్సాహకాల పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. అంతేకాకుండా లెక్చరర్ల సమస్యల సాధనకు సంఘం తరఫున పోరాటం చేస్తానని, బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. మరోవైపు జిల్లా ఇంచార్జ్‌గా నియామకం అయిన శ్రీనివాస్ గౌడ్‌ను నేతలు, అసోసియేషన్ సభ్యులు, అభిమానులు శుభకాంక్షలు తెలిపి అభినందించారు.
ఇదికూడా చదవండి…

