ఆందోళన వద్దు..!
– హెచ్‌ఎంపీవీ వైరస్‌పై కేంద్రం
– జాగ్రత్తలు పాటించాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ
దర్శిని డెస్క్ : ప్రపంచ దేశాలతో పాటు భారత్ దేశంలో కూడా హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పటికి వ్యాప్తిలోనే ఉందని, కాని ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్రం వెల్లడించింది. అయినప్పటి జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. వెల్లడించింది. భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడటం కలవరపాటుకు గురిచేస్తోంది. మిగతా శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ.. పేర్కొంది. దేశంలో ఇన్‌ఫ్లుయెంజా మాదిరి వ్యాధులు (ILI) లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు (SARI) అసాధారణ రీతిలో ఏమీ లేవని స్పష్టం చేసింది.
సీజనల్ శ్వాసకోశ సంబంధింత కేసులను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామగ్రి, పడకలు, ఇతర వసతులతో భారత్‌లోని ఆసుపత్రులు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. శీతాకాలంలో అవసరమైన జాగ్రత్తలు వహించడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే హెచ్‌ఎంపీవీ ఉంటుంది. సాధారణ జలుబు, ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నారుల్లో, వృద్ధుల్లో ఈ ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది’’ అని కేంద్ర ఆరోగ్యసేవల డైరెక్టర్ జనరల్ (DGHS) డాక్టర్ అతుల్ గోయల్ పేర్కొన్నారు.
రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిపైనే ప్రభావం
హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) అనేది ఇదివరకే తెలిసిన వైరస్. తొలిసారిగా దీనిని 2001లో నెదర్లాండ్స్‌లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో సంభవించే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లలో 12శాతం వరకు ఇదే కారణమవుతోందని అంచనా. తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన వాళ్లలోనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అవసరం అవుతుంది. సాధారణంగా 11ఏళ్ల చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)ని పోలి ఉండే ఈ వైరస్.. ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది.
ఇదికూడా చదవండి…

