దౌర్జన్యమే కాంగ్రెస్ సంస్కృతి
– కమీషనర్ ను దూషించడం బాధాకరం
– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షున్ని అరెస్టు చేయాలి
– బీఆర్ఎస్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్
-కమీషనర్ ఘటనను ఖండించిన బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దూషించడం.. దౌర్జన్యాలకు పాల్పడడం కాంగ్రెస్ సంస్కృతిలోనే ఉందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల దూషించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయాన్ని రాజు గౌడ్ తో పాటు పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తదితరులు కలిసి సందర్శించారు. మున్సిపల్ కమీషనర్ పై హబీబ్ లాల దూషించడాన్ని ఖండించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, తాండూరులో నేతలు దూషించడమే సంస్కృతిగా పెట్టుకున్నారని విమర్శించారు.
నాయకులు అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడడం తగదన్నారు. మున్సిపల్ కమీషనర్ ను దూషించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హాబీబ్ లాలను వెంటనే అరెస్టు చె యాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇలాంటి వ్యక్తుల వల్ల జాగ్రత్త పడాలన్నారు. ఇలాంటి దొంగల వల్ల తాండూరు అభివృద్ధి జరగదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. తాండూరులో జరుగుతున్న అరాచాకాలపై వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు సందీప్ రెడ్డి, ఎర్రం శ్రీధర్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

