వామ్మో.. కి’లేడీ’లూ..!
– జువెల్లరీ షాపులో వెండి పట్టీలు చోరీ
– సీసీ పుటేజీలో రికార్డు అయిన దృశ్యాలు
– గమనించిన స్వాదీనం చేసుకున్న యజమానులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మగ మయాగాల్లకు ఏమాత్రం తీసిపోమని కొందరు మహిళలు ఏమార్చి టోకరా వేయడంలో ఆరితేరి ఉంటారు. ఓ మాయ కిలేడీలూ జువెల్లరీ షాపులో వెండి గొలుసులు కొనేందుకు వచ్చి రెండు జతలను కొట్టేశారు. సీసీ పుటేజీలో రికార్డు అయిన దృశ్యాలను గమనించిన యజమానులు వారిని గుర్తించి చోరి చేసిన గొలుసులను స్వాదీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం గాంధీ చౌక్ సమీపంలో బ్రహ్మచారి అనే వ్యక్తి శ్రీ వెంకటేశ్వర చారి అండ్ సన్స్ జువెల్లర్స్ పేరుతో షాపు నిర్వహిస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు గుర్తుతెలియని మహిళలు వచ్చి వెండి పట్టీగొలుసులు చూపించాలని కోరారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వారికి పలు రకాల పట్టీలను చూపించారు. ఒకేసారి ఐదు, పది జతలను వేయడంతో పరిశీలిస్తున్నట్లు నటిస్తూ సిబ్బందిని ఏమార్చి రెండు జతలను కొట్టేశారు. అక్కడి నుంచి వెళ్లిపోతున్న క్రమంలో పట్టీలను తూకం వేయగా రెండు జతలు తక్కువగా వచ్చినట్లు అనుమానం కలిగింది. సీసీ పుటేజీలను పరిశీలించి నిలదీయగా ఒక జత ఇచ్చేసి.. మరో జతతో పారిపోయే యత్నం చేశారు. రెండో జతను కూడా స్వాదీనం చేసుకుని మందలించి పంపించినట్లు యజమాని బ్రహ్మచారి తెలిపారు. ఇదిలా ఉండగా ఈ మహిళలు మరో షాపులోకి వెళ్లి.. ఇదే విధంగా చోరీ చేసేందుకు యత్నించినట్లు తెలిసింది.
ఇదికూడా చదవండి…

