జిల్లా వాసులకు శుభవార్త చెప్పిన స్పీకర్..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

జిల్లా వాసులకు శుభవార్త చెప్పిన స్పీకర్..!
– రూ. 4వేల 250 కోట్లతో సిక్సే వే రోడ్డు
– మన్నెగూడ, వికారాబాద్, తాండూరు మీదుగా నిర్మాణం
– తాండూరు – హైదరాబాద్ రోడ్డుకు కొత్త టెండర్లు
– సంక్షోభం నుంచి గట్టెక్కితే.. ఎవ్వరు ఆపలేని సంక్షేమం అందిస్తాం
– తాండూరులో మైనార్టీలకు 10 ఎకరాల స్థలం మంజూరుకు కృషి
-తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా మీదుగా కర్ణాటక రాష్ట్రానికి రూ. 4వేల కోట్లతో సిక్స్ వే రోడ్డు మంజూరు కాబోతుందని రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, జీఎంకే బిల్డర్స్ ప్రొప్రైటర్ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సయ్యిదూనా అలీ మజీద్ ప్రారంభోత్సవంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న తాండూరు – హైదరాబాద్ రోడ్డు నిర్మాణంకు పాత టెండర్లను రద్దు చేయించడం జరిగిందని తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి కొత్త టెండర్ ను ఆహ్వానించడం జరిగిందని గుర్తుచేశారు.

వీలైనంత త్వరలో ఖచ్చితంగా రోడ్డు పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి జిల్లాలో భారీ రోడ్డుకు ప్రతిపాదనలు అందించడం జరిగిందన్నారు. ఈ మేరకు మన్నేగూడ, వికారాబాద్, తాండూరు మీదుగా కర్ణాటకలోని జహీరాబాద్, బీదర్ ప్రాంతాలకు రూ. 4వేల 250 కోట్లతో సిక్స్ వే(ఆరు వరుసలు) రోడ్డు మంజూరు కాబోతుందని వెల్లడించారు. ఈ రోడ్డు మంజూరైతే జిల్లా ప్రజలతో పాటు తాండూరు ప్రజలకు కర్ణాటక రాష్ట్రా లతో సత్సంబందాలు బలపడతాయన్నారు. తాండూరులో మైనార్టీలు కోరిన విధంగా 10 ఎకరాల స్థలం మంజూరుకు కృషి చేస్తామని అన్నారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఏరికోరి ఎన్నుకుని అధికారంలోకి తీసుకవచ్చారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వల్ల పథకాల అమలులో జాప్యం జరుగుతుందని అన్నారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిన వెంటనే ఎవ్వరు ఆపలేని విధంగా సంక్షేమ పథకాలను ఇంటింటికి అమలు చేస్తామన్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ముజీబ్ ఖాన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డా. సంపత్ కుమార్, మైనార్టీ నాయకులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యం..!