ఏండ్ల కల సాకారా దార్శనీకుడు.. మనోహర్ రెడ్డి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఏండ్ల కల సాకారా దార్శనీకుడు.. మనోహర్ రెడ్డి..!
– తాండూరు ఎమ్మెల్యేపై గంజ్ అసోసియేషన్ ప్రశంస జల్లు
– హైదరాబాద్ రోడ్డు పనుల ప్రారంభం కృషికి జేజేలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదేళ్లుగా తాండూరు ప్రజలు ఎదురు చూస్తున్న తాండూరు – హైదరాబాద్ రోడ్డు కలను నెరవేర్చిన దార్శనీకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు అభివర్ణించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో ఆదివారం తాండూరు – హైదరాబాద్ రోడ్డు పనులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గంజ్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ రాములు గౌడ్, కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్, సభ్యులు కల్వ రాధాకృష్ణ, పటేల్ శ్రీశైలం, నారా జైపాల్ రెడ్డి, భోజిరెడ్డి తదితరులు మాట్లాడుతూ తాండూరు – హైదరాబాద్ రోడ్డు పనుల ప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు. తాండూరు ప్రజల కలగా నిలిచిన తాండూరు – హైదరాబాద్ రోడ్డు పనులకు రూ. 49.78 కోట్లతో శ్రీకారం చుట్టి పనులను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న తాండూరు -హైదరాబాద్ రోడ్డు పనులను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రారంభానికి కృషి చేయడం అభినందనీయమన్నారు.

ముఖ్యంగా తాండూరు వ్యాపార రంగానికి కేంద్ర బిందువు అయిన గంజ్ కు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వర్తక వ్యాపారాలస్తులు, అధికారులు, చాలా ఇబ్బందిగా ఉండేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కానీ ఇట్టి పనిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి రోడ్డు పనులను ప్రారంభించడం అభివృద్ధికి నాంది అని అన్నారు. ఇందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కట్కం వీరేందర్, మల్లేపల్లి వెంకటేశం, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సేవకు వేదిక.. లయన్స్ క్లబ్..!