సంక్షేమంలో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

సంక్షేమంలో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం
– సీఎం కేసీఆర్ పాల‌న‌లో మ‌హిళ‌ల సాధికార‌త‌
– మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళ సంక్షేమానికి ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన మ‌హిళ బంధు సంబరాల‌లో భాగంగా పట్టణంలోని 9వ వార్డులో అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన మహిళ బంధు వేడుకలలో వైస్ చైర్ పర్సన్ ప‌ట్లోళ్ల దీపా నర్సింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఒంటరి మహిళకు ఆసరా ఫించన్, కేసీఆర్ కిట్, షీటీం వంటి సంక్షేమ ప‌థ‌కాల‌తో మ‌హిళ‌ల సంక్షేమానికి పాటుప‌డుతుంద‌న్నారు. అదేవిధంగా స్త్రీనిధి రుణాలు, ప‌లు ర‌కాల రాయితీల‌తో అభ్య‌న్న‌తికి తోడ్పాటు అందిస్తున్నారు. తెలంగాణ ప‌థ‌కాల‌తో ల‌బ్దిపొందుతున్న ప్ర‌తి మ‌హిళ ప్ర‌భుత్వానికి రుణ‌ప‌డి ఉండాల‌న్నారు. ఈ పథకాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నవీన, ఆర్సీ భాను తదితరులు ఉన్నారు.