భద్రేశ్వరున్ని దర్శించుకున్న రూరల్ సీఐ..!
– సీఐ నగేష్‌ను సన్మానించిన దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామిని తాండూరు రూరల్ సీఐ నగేష్ దర్శించుకున్నారు. బుధవారం మహా శివరాత్రి సందర్భంగా రూరల్ సీఐ నగేష్ భద్రేశ్వర దేవాయలాన్ని సందర్శించారు. దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ సీఐ నగేష్‌ను స్వాగతించారు. మహా శివరాత్రి సందర్భంగా సీఐ నగేష్ దేవాలయంలోని శివున్ని దర్శించుకున్నారు. శివునితో పాటు భద్రేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అనంతరం దేవాలయంలోని చైర్మన్ కార్యాలయాన్ని సీఐ సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ సీఐ నగేష్‌ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినాన అందరిపై పరమ శివుని కృప ఉండాలని, ప్రజలందరు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బుయ్యని భరత్ రెడ్డి, వికాస్ జోషి తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

