కాంగ్రెస్ వస్తే మళ్లీ మోసమే..!
– పంచాయతీలో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలి
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– తాండూరు మండలంలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇచ్చిన హామిలను నెరవేర్చకుండా గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని నమ్మితే మళ్లీ మోసమే చేస్తుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.

మంగళవారం పంచాయతీ ఎన్నికల చివరి రోజు ప్రచారం సందర్భంగా తాండూరు మండలం కోటబాస్పల్లి, ఖాంజాపూర్, ఐనెల్లి తదితర గ్రామాల్లో పర్యటించి బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని రోహిత్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి గెలిచిన తరువాత హమీలను అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు.

మళ్లీ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మళ్లీ మోసం చేస్తారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒకసారి మోసపోయి.. గోసపడింది ఇక చాలు అని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభత్వానికి బుద్ది చెప్పాలని అన్నారు.

మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మెజార్టీ అందించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కోటబాస్పల్లి గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి గెలుపుకోసం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుర్వ నాగార్జున, నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

