కెనరా బ్యాంకు ఉత్తమ సేవలు భేష్..!
– రూ.100 కోట్ల టర్నోవర్ కృషి అభినందనీయం
– తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– ఘనంగా కెనరా బ్యాంకు వార్షికోత్సవ వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలో బ్యాంకింగ్ రంగంలో కెనరా బ్యాంకు వినియోగదారులకు అందించే సేవలు భేష్ అని తాండూరు మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. రూ.100 కోట్ల టర్నోవర్ సాధించడంలో కెనరా బ్యాంకు కృషి అభినందనీయమని మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. తాండూరు పట్టణంలోని కెనరా బ్యాంకులో శనివారం 8వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతి థిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె బ్యాంకు అధికారులు, ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాండూరులో ఏర్పాటైన కెనరా బ్యాంకు 8 ఏండ్లలో రూ. 100 కోట్ల టర్నోవర్ సాధించడం అభినందనీయమన్నారు. బ్యాంకింగ్ రంగంలో వినూత్న సేవలను అందిస్తూ ముందుకు సాగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇకముందు కూడా బ్యాంకు ఖాతా దారులకు, వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించాలని కోరారు. అంతకుముందు బ్యాంకు అధికారులు, ఉద్యోగులు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

