ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి
– దీపావళీ శుభాకాంక్షలు తెలిపిన వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
తాండూరు, దర్శని ప్రతినిధి: దీపావళి పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆకాంక్షించారు. గురువారం దీపావళి సందర్భంగా ఆమె పట్టణ ప్రజలకు పండగ శుభాకాంక్షలను తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని ఆకాంక్షించారు.


