రెండో రోజూ 18 మంది గైర్హాజరు..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

రెండో రోజూ 18 మంది గైర్హాజరు..!
– ప్రశాంతంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు
– కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇంటర్ సెకండ్‌ ఇయర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థుల మాదిరిగానే సెకండ్‌ ఇయర్ విద్యార్థులు సరైన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈసారి ఒక్క నిమిషం నిబంధనను నిషేధించి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ రూల్ అమలు చేయడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.

ఇంటర్ సెకండ్‌ పరీక్షలకు కూడా పట్టణంలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనరల్‌కు సంబంధించి తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2, భాష్యం కాలేజీ, సింధు బాలికల జూనియర్ కాలేజీ, సిద్దార్థ జూనియర్ కాలేజీలతో పాటు ఒకేషనల్ విభాగంలో హైదరాబాద్ రోడ్డు మార్గంలోని టీఎంఆర్జేసీ, టీఎస్ డబ్ల్యూఆర్ కాలేజీలను కేటాయించారు. జనరల్లో  1554 మంది వి ద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13 మంది గైర్హాజరుతో 1541 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఓకేషనల్ విభాగంలో 530 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 05 మంది గైర్హాజరుతో 525 మంది పరీక్షలు రాశారు. మొత్తంగా మొదటి రోజు 2084 మందిలో 18 మంది గైర్హాజరుతో 2066 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగిందని కస్టోడీయన్లు కృష్ణయ్య, కిష్టప్పలు ఓ ప్రకటనలో తెలిపారు. అంతకుముందు తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పట్టణ సీఐ సంతోష్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు.

ఇదికూడా చదవండి…

మిషన్‌ నీళ్లు.. మైదానం పాలు..!