విద్యారంగానికి మైలురాయి..!
– ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణంకు నిధులు హర్షణీయం
– ఎమ్మెల్యే కృషిని అభినందించిన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణం విద్యారంగంలో మైలురాయిగా నిలుస్తుందని స్థానిక ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అభివర్ణించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటేడ్ స్కూల్ తాండూరుకు కేటాయించడంతో పాటు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సోమవారం తాండూరు పట్టణంలోని అసోయేషన్ కార్యాలయంలో అధ్యక్షులు కమల్ అతహర్, ప్రధాన కార్యదర్శి ఖాలిద్ సైఫుల్లా, ఉపాధ్యక్షులు ఎండీ బాసిత్ అలీ, అబ్దుల్ సలీం, అబ్దుల్ ఖవి, కార్యదర్శులు ఖయ్యూం అతహర్, ఎండీ యూనుస్ తదితరులు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో రూ.200ల కోట్లతో ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణం చేపట్టబోతుండడం హర్షణీయమన్నారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి అభినందనీయమన్నారు.

అన్ని వర్గాల పేద విద్యార్థులకు సుమారు 25 ఎకరాలలో ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మించడంతో విద్యారంగంలో మైలురాలుగా నిలుస్తుందని అభివర్ణించారు. నియోజకవర్గ విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వానికి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అబ్దుల్ హమీద్, పాషా ఖురేషీ, ఖలీలుల్లా షరీఫ్, కార్యదర్శులు ఎండీ అజహర్, కోశాధికారి ఎండి సీరాజ్, సభ్యులు ఖయ్యూం పాష, ముస్తాక్, వసీం, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

