బాబు కోసం బచ్పన్ ఫ్రెండ్స్..!
– వశిష్టకు రూ. 10వేల ఆర్థిక సాయం
– మానవత్వానికి పలువురు అభినందన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవ్వరు ఆపదలో ఉన్న చేయూతను అందించి ఆదుకునే మనస్సు ఉండాలని తాండూరు బచ్పన్ వెల్పేర్ ఫ్రెండ్స్ సభ్యులు అన్నారు. అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న 9 నెలల బాలుడు వశిష్ఠ ఆపరేషన్ కోసం వారు ఆర్థిక సాయం అందజేశారు.

యాలాల మండలం సంగెంకు చెందిన భానుప్రియ, శికుమార్ల కుమారుడు ఆరోగ్య పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న బచ్పన్ ఫ్రెండ్స్(1998-99) వెల్పేర్ బ్యాచ్ సభ్యులు స్పందించి ఆదివారం కుటుంబ సభ్యులకు రూ. 10వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారి వైద్యం కోసం అందరు కలిసి ఆర్థిక సాయం అందించాలని కోరారు. మరోవైపు చిన్నారి వశిష్ఠకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్న బచ్పన్ వెల్ఫేర్ ఫ్రెండ్స్ సాయంకు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో విద్యావేత్త పర్యాద రామకృష్ణ, బచ్ పన్ వెల్ఫేర్ ఫ్రెండ్స్ సభ్యులు మతీన్, బి.రవి, ఇర్షాద్, రంజిత్, కిషన్ గోపాల్, సంతోష్, గోవింద్, ముల్బాంద్, ఇస్మాయిల్, మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

