విద్యార్థులకు ఆదాని సిమెంట్స్ చేయూత
– స్కూల్ బ్యాగులు, బూట్లు పంపిణీ చేసిన ప్రతినిధులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చిట్టిగణాపూర్ లోని పాఠశాల విద్యార్థులకు అదాని సిమెంట్స్ ఫ్యాక్టరీ చె యూత అందించారు. మంగళవారం పాఠశాలలోని 40 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బూట్లు, ట్రాక్ సూట్స్ పంపిణీ చేశారు. అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులు నాగార్జున, విజయ్ కుమార్ పటేల్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఫ్యాక్టరీ తరుపున చేయూత అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు శ్రద్దగా చదుకోవాలన్నారు. ఉత్తమ మార్కులు సాధించి పైతరగతులకు వెళ్లాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఫ్యాక్టరీ తరుపున పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బసిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శిరీషా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి, ఉపాధ్యాయులు ప్రమోద్, అంగన్ వాడి టీచర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

