ప్రవేటు ఫాంహౌస్‌కు సీసీ రోడ్డు సిగ్గుచేటు…!
– రూ. 60 లక్షల దుర్వినియోగం చేస్తారా
– తిరిగి కక్కించేంత వరకు వదిలేదిలేదు
– బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు అవసరమైన చోట కాకుండా ప్రవేటు వ్యక్తికి చెందిన ఫాంహౌస్ కు రోడ్డు సీపీ రోడ్డు వేయడం సిగ్గుచేటని తాండూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం మండిపడ్డారు. తాండూరు పట్టణ శివారు కోకట్ గ్రామ శివారు పరిధి, పాత కుంట సమీపంలో ఓ కాంగ్రెస్ నాయకుడుకు చెందిన ఫాం హౌస్ వద్ద సీసీ రోడ్డు వేయడం పట్ల విమర్శించారు. గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం నాయకులతో కలిసి నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్ ఈజీఎస్ నిధులు రూ.60లక్షలతో సీసీ రోడ్డు వేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయం లేదు.. ఒక బస్టాండ్ కూడా లేదు.. ఉపయోగం లేని ప్రదేశంలో ఓ వ్యక్తికి చెందిన ఫాంహౌస్ కు రోడ్డు వేయడం అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిధులు మంజూరు చేయడం విడ్డూరమన్నారు. కేంద్ర ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేయడం సమంజసం కాదని అన్నారు.

ఈ నిధుల దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్, ఎంపీ తదితరుల దృష్టికి తీసుకెళతామని అన్నారు. ప్రవేటు వ్యక్తి చేతనే వినియోగించిన నిధులను కక్కించేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బంటారం భద్రేశ్వర్, మాజీ కౌన్సిలర్ బాలప్ప, దోమ కృష్ణ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

