ఘనంగా కార్మిక దినోత్సవం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా కార్మిక దినోత్సవం
– ఎర్ర జెండాలను ఆవిష్కరించిన కార్మిక సంఘాల నేతలు
తాండూరు/రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు మండలంలో మే డే కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఏఐటీయూసీ, సీఐటీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఆవిష్కరించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్, మున్సిపల్ కార్యాలయంతో పాటు తాండూరు మండలంలోని పెన్నా సిమెంట్ కర్మాగారంలో జిల్లా నాయకులు విజయలక్ష్మి పండిత్, సీనియర్ నాయకులు జనార్ధన్ రెడ్డిలు ఎర్ర జెండాలను ఆవిష్కరించారు. మరోవైపు సీఐటీయూ నాయకులు శ్రీనివాస్ ఆధ్వర్యం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎర్ర జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి టీజేఎస్ ఇంచార్జ్, కౌన్సిలర్ సోమ శేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్మికుల పక్షాన సంఘాలు నిరతరం పోరాటం చేస్తాయని పేర్కొన్నారు.