బీసీ స్మశాన వాటికకు మోక్షం..!
– రూ. 10 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే
– మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని బీసీ స్మశాన వాటికకు మోక్షం లభించబోతోంది. గత కొన్నేళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న బీసీ స్మశాన వాటికపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టి సారించారు. తాండూరుకు చెందిన బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ పలుమార్లు స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

తాజాగా బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించి బీసీ స్మశాన వాటికకు రూ. 10లక్షలు మంజూరు చేశారు. ఈ ప్రోసిడింగ్ కాపీని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, నాయకుల సమక్షంలో అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దశల వారిగా స్మశాన వాటిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని అన్నారు. అదేవిధంగా స్మశాన వాటిక అభివృద్ధికి రూ. 10లక్షలు మంజూరు చేయడం పట్ల రాజ్ కుమార్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు బంటు మల్లప్ప, బంటు వేణుగోపాల్, బీసీ సంఘం నాయకులు లక్ష్మణ్ చారి, రాము ముదిరాజ్, మంతటి రాజు, బస్వరాజ్, అనిత, లక్ష్మీ, యువకులు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

