గ్రామాల్లో శాంతిభ‌ద్ర‌ల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త‌

తాండూరు వికారాబాద్

గ్రామాల్లో శాంతిభ‌ద్ర‌ల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త‌
– ఉచిత న్యాయ సేవ‌లపై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి
– అంతారంలో అవ‌గాహ‌న క‌ల్పించిన ప‌ట్ట‌ణ ఎస్ఐ గిరి
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: గ్రామాల్లో శాంతి భ‌ద్రత‌ల ప‌రిర‌క్ష‌కు ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌త‌గా ఉండాల‌ని తాండూరు ప‌ట్ట‌ణ ఎస్ఐ గిరి అన్నారు. ఆదివారం తాండూరు మండ‌లం, ప‌ట్ట‌ణ పోలీస్టేష‌న్ ప‌రిధి అంతారం గ్రామంలో ప్ర‌జ‌ల‌కు ఉచిత న్యాయ‌సేవ‌లు, చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. అనంత‌రం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన భ‌వ‌న‌, ఇత‌ర కార్మ‌కుల సంక్షేమ ప‌థ‌కాల ప‌రిచయ క‌ర‌త్రాన్ని ఎస్ఐ గిరి గ్రామ స‌ర్పంచ్ రాములు, ఎంపీటీసీ శాంతు, గ్రామ‌పెద్ద‌లు, అంగన్‌వాడి టీచ‌ర్ల‌తో క‌లిసి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎస్ఐ గిరి
మాట్లాడుతూ గ్రామాల్లో ప్ర‌తి చిన్న విష‌యానికి ఎవ్వ‌రు గొడ‌వ ప‌డి పెద్ద‌దిగా చేసుకోవ‌ద్ద‌ని అన్నారు. గొడ‌వ‌లు, ఘ‌ర్ష‌ణ‌ల‌కు పోకుండా శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు స‌హ‌క‌రించాల‌న్నారు. మ‌హిళ‌లు, అమ్మాయిల‌పై వేధింపుల‌కు పాల్ప‌డితే జైలు శిక్ష త‌ప్పద‌న్నారు. చిన్న చిన్న కేసుల్లో ఉన్న పేద‌ల‌కు ఉచిత న్యాయ సేవ‌ల ద్వారా స‌త్వ‌ర న్యాయం జ‌రుగుతుంద‌ని, కోర్టు సేవ‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ నాయకులు ప్రకాష్, అంగన్వాడీ టీచ‌ర్లు జయశీల, గ్రామస్తులు పాల్గొన్నారు.