నేడే భద్రేశ్వర రథోత్సవం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నేడే భద్రేశ్వర రథోత్సవం..!
– వేడుకలపై అందరి దృష్టి
– పోలీసుల బందోబస్తు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భద్రేశ్వర జాతర ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవ వేడుకకు వేళ అయ్యింది. నేడు స్వామి వారి రథోత్సవంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి యేడాది చైత్ర మాసంలో భద్రేశ్వర జాతర ఉత్సవాలు జరుగుతాయి.

ఈ జాతర ఉత్సవాలలో రథోత్సవం, లంకాదహన వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. తాండూరుతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ యేడాది కూడా జాతర ఉత్సవాలు బ్రహ్మండంగా జరుగుతున్నాయి. శనివారం రథోత్సవ వేడుకలపై అందరి దృష్టి పడింది. రథోత్సవం కోసం సాయంత్రం కలశ దారణ చేయనున్నారు. రాత్రి 11-05గంటలకు రథోత్సవం ప్రారంభించనున్నారు.

ఈ వేడుకలకు రాజకీయ అథిరథ మహారథులు హాజరుకాబోతున్నారు. మరోవైపు రథోత్సవం సందర్భంగా ప్రభుత్వ శాఖల నుంచి అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసు శాఖ నుంచి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం ఇద్దరు డీఎస్పీలు, 7గురు సీఐలు, 20 మంది ఎస్ఐలు, 11 మంది ఏఎస్ఐలు, 30 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 41 మంది హోంగార్డులతో భద్రత నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి….

భద్రేశ్వర భక్తులకు నిత్యాన్నదానం