ఫలితంఫై ఆందోళన వద్దు..!
– ఏదైనా సానుకూలంగా తీసుకోండి
– ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరండి
– అధ్యాపకులు పర్యాద రామకృష్ణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్ ఫలితాలపై విద్యార్థులు ఎలాంటి ఆందోళన, నిరాశ, నిస్పృహలకు గురికావద్దని తాండూరుకు చెందిన విద్యావేత్త, అద్యాపకులు పర్యాద రామకృష్ణ విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన ఓ ప్రకటనలో విద్యార్థులకు సూచనలు చేశారు.

పరీక్షల్లో మీ వంతు ప్రయత్నం మీరు చేశారు ఫలితం ఎలా వచ్చిన సానుకూలంగా తీసుకొని మీ లక్ష్యం పై గురి పెట్టాలని అన్నారు. ముఖ్యంగా రెండవ సంవత్సర విద్యార్థులారా ఈ ఫలితాల ప్రభావం మీరు రాయబోయే నీట్, ఇంజినీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష(EAPCET), ఇతర పోటీ పరీక్షల పై పడకుండా చూసుకోవాలన్నారు. మీరు అనుకున్న ఫలితం రెట్టింపు ఆత్మవిశ్వాసంతో పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు సిద్దం కావాన్నారు.

ఒకవేళ మీరు అనుకున్న ఫలితం రాకపోయినా మనోస్థైర్యంతో ముందుకు సాగి పోటీ పరీక్షల్లో, ఉన్నత విద్యలో మీ ప్రతిభను చూపి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని అన్నారు. ఫలితాల ప్రభావం మీ పోటీ పరీక్షల సన్నద్ధత పై పడకుండా మీరు అనుకున్న లక్ష్యం చేరేవిధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి….

