150 రోగాలకు బ్రహ్మాస్త్రం..!
– రణపాల ఆకు అంటే మజకా
– కామెర్లు, కిడ్నీ, మూత్ర సమ్యలకు చెక్
దర్శిని ప్రతినిధి : ఆయుర్వేద మూలికల్లో రణపాల అనే ఆకు వ్యాధులపై బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. రణపాల ఆకు తింటే 150కి పైగా రోగాలను నయం అవుతాయని చెబుతున్నారు. జీర్ణాశయంలో అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను నివారిస్తుంది. రణపాల ఆకులు కిడ్నీల సమస్యలను నివారిస్తుంది. బ్లాడర్ లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి. డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.

రణపాల మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, అనాఫిలాక్టిక్ లక్షణాలు అధికం. ఇందులోని ఫ్లేవనాయిడ్లూ గ్లైకోసైడ్లూ స్టెరాయిడ్లూ కర్బన ఆమ్లాలకు క్యాన్సర్‌ను నిరోధించే శక్తి ఉందట.
కామెర్లు ఉన్నవారు ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ఎంఎల్ తీసుకుంటే వ్యాధి నయం అవుతుంది. రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలను నివారిస్తుంది. రణపాలలో జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేసే గుణాలు ఉన్నాయి. రణపాల ఆకులను పేస్ట్ లా చేసి నుదుటిపై పట్టీలా వేస్తే తలనొప్పి తగ్గుతుంది.
శ్వాసకోశ, మూత్రాశయ, జీర్ణ సంబంధ సమస్యల్నీ ఇన్ఫెక్షన్లు, పుండ్లు వంటి వ్యాధుల్నీ నివారిస్తుందనీ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మధుమేహులకీ, బీపీ రోగులకీ మందుగా పనిచేస్తుందనీ, శ్వాసకోశ, మూత్రాశయ, జీర్ణ సంబంధ సమస్యల్నీ ఇన్ఫెక్షన్లు, పుండ్లు వంటి వ్యాధుల్నీ నివారిస్తుందనీ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెన్నో రణపాల ఆకుల్లో గుర్తించారు. మధుమేహులకీ బీపీ రోగులకీ మందుగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణుల విశ్వాసం.
(గమనిక: నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించండం ముఖ్యం)
ఇదికూడా చదవండి…

