ప్రతి వారం పోలీసుల పరేడ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రతి వారం పోలీసుల పరేడ్..!
– సత్సంబంధాల మెరుగుకు చర్యలు
– తాండూరు రూరల్ సీఐ నగేష్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసు శాఖలో ప్రతి వారం సిబ్బందితో పరేడ్ నిర్వహించడం జరుగుతుందని తాండూరు రూరల్ సీఐ నగేష్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని విలియమూన్ గ్రౌండ్ లో తాండూరు సబ్ డివిజన్ పోలీసులతో పరేడ్ నిర్వహించారు. రూరల్ సీఐ నగేష్ ఆధ్వర్యంలో ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పరేడ్ లో పాల్గొన్నారు.

కవాతు చేస్తూ గౌరవ వందనం చేశారు. ఈ సందర్బంగా రూరల్ సీఐ నగేష్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిల ఆదేశాలతో ప్రతి వారం పోలీసులతో పరేడ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరేడ్ వల్ల పోలీసుల మద్య సత్సంబంధాలు మెరుగు పడతాయన్నారు. పోలీసులు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారని అన్నారు. అంతేకాకుండా నేరాల నియంత్రణకు కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. ప్రతి వారం పోలీసులు విధిగా పరేడ్ లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్, విఠల్ రెడ్డి, శంకర్, గిరన్న, ఆయా పోలీస్టేషన్ల ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పురుడు కోసం వస్తే ప్రాణం పోయింది..!