డా. జయప్రసాద్ కు మరో ఉత్తమ అవార్డు
– రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా. జయప్రసాద్ కు మరో ఉత్తమ అవార్డు దక్కింది. శుక్రవారం హైదరాబాద్ మణికొండలోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో రాజ్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ సేవలను అందించిన వైద్యులకు విస్సా హెల్త్ అవార్డులను అందజేశారు. తాండూరు నుంచి ఐఎంఏ అధ్యక్షులుగా, పేదలకు గుండెపోటు, క్యాన్సర్ తదితర అంశాలలో అవగాహన కల్పించడంతో పాటు ఉత్తమ వైద్య సేవలు అందించినందుకు గాను డా. జయప్రసాద్ ను విస్సా హెల్త్ అవార్డుకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కల చేతుల మీదుగా డా.జయప్రసాద్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ అవార్డులు పొందడం వల్ల పేదలకు, ప్రజలకు మరిన్ని ఉత్తమ సేవలను అందించే ఉత్సాహం నింపుతాయన్నారు. వైద్య వృత్తిలో ఉన్నంత వరకు తన వంతు సేవలు అందిస్తానని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి…

