మనోళ్లు.. ప్రతిభా వంతులే..!
– పదిలో సాధించిన ఫలితాలే నిదర్శనం
– ఆర్బీఓఎల్ ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి
– అట్టహాసంగా విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామీణ ప్రాంత విద్యార్థులలో అపారమైన నైపుణ్యాలు దాగి ఉన్నాయని, ఇందుకు పదో తరగతిలో విద్యార్థులు సాధించిన ఫలితాలే నిదర్శమని తాండూరు ఆర్బీఓఎల్ ఎండి (మేనేజింగ్ డైరెక్టర్) బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హిందూ ధార్మిక పరిషత్, చైతన్య జూనియర్ కాలేజీ, ప్రైవేటు పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో పదో తరగతిలో ర్యాంకులు, ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆర్బీఓఎల్ ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులోని ప్రైవేటు పాఠశాలల కృషితో స్థానిక పదో తరగతి విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు వస్తున్నాయన్నారు. జిల్లాలో మొదటి 3టాప్ ర్యాంకులు తాండూరు విద్యార్థులకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తోడ్పాటు అందించాలన్నారు. ఎంఈఓ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సహాంతో విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
చైతన్యలో అనాథ విద్యార్థులకు ఉచిత విద్య
అదేవిధంగా చైతన్య జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పదో తరగతిలో ర్యాంకులతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. తల్లిదండ్రులు లేని.. పదో తరగతిలో ఫలితాలు సాధించిన విద్యార్థులకు తమ కాలేజీలో ఉచిత విద్య అందించడం జరుగుతుందని, పేద విద్యార్థులకు ఫీజులలో రాయితీ కల్పించడం జరుగుతుందని ప్రకటించారు. అనంతరం చైతన్య జూనియర్ కాలేజీ యజమాన్యం సహాకారంతో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కూడా మెమెంటో, సర్టిఫికెట్లతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక పరిషత్ కోకన్వీనర్లు నరేందర్, వేణుగోపాల్ రెడ్డి, ట్రస్టీలు ఓం ప్రకాష్ సోమాని, పటేల్ విజయ్ కుమార్, ప్రైవేటు పాఠశాలల యజమాన్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్ రెడ్డి. మోహన్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, చైతన్య’ కాలేజీ డైరెక్టర్ నిర్మళా రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

