పేదింటి పెండ్లికి పుస్తె, మెట్టెల కానుక
– బీవీజీ ఫౌండేషన్ ద్వారా అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: పేదింటిలో జరిగిన పెండ్లికి తాండూరు బీవీజీ ఫౌండేషన్ చేయూతనందించింది. తాండూరు పట్టణంలోని 32వ వార్డు సీతారాంపేట్‌కు చెందిన పేదింటికి చెందిన అమ్మాయి వివాహాం నిశ్చయించారు. పెండ్లికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో వార్డుకి చెందిన టీఆర్ఎస్ యువనాయకులు శివానంద్ విషయాన్ని బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సునితాసంపత్ స్పందించి పెండ్లికి కావాల్సిన పుస్తె, మెట్టులను అందించేందుకు ముందుకొచ్చారు. బుధవారం బీవీజీ ఫౌండేషన్ సహాకారంతో శివానంద్, టీఆర్ఎస్ యువనాయకులు చంటి యాదవ్‌ల ద్వారా పెండ్లి కూతురు కుటుంబ సభ్యులకు అందజేశారు.

