అవిశ్వాసం పెంపు హర్షణీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

అవిశ్వాసం పెంపు హర్షణీయం
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ల అవిశ్వాస కాల పరిమితిని పెంచడం హర్షణీయమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లకు నాలుగేళ్ల తరువాత ఆవిశ్వాసం పెట్టాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడంపై బుధవారం హైదరాబాద్లో తెలంగాణ చాంబర్ ఆఫ్ మున్సిపల్ చైర్మన్ భవన్ లో నిర్వహించిన సంబరాలలో ఛైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ల అవిశ్వాస కాల పరిమితిని పెంచడం హర్షణీయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామన్నారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల‌ చిత్రపటానికి నిర్వహించిన పాలాభిషేకంలో నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ చైర్ పర్సన్ మంజుల, పరిగి చైర్మన్ ముకుంద్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.