డ‌బుల్ ఇండ్లు, నామినేటెడ్ ప‌దవులు..!

తాండూరు వికారాబాద్

డ‌బుల్ ఇండ్లు, నామినేటెడ్ ప‌దవులు
– ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కోరిన ఉద్య‌మ‌కారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న డ‌బుల్ బెడ్ రూం ఇండ్లతో ప్రాధాన్యమిస్తూ.. నామినేటేడ్ ప‌ద‌వుల్లో అవ‌కాశం క‌ల్పించాల‌ని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని స్థానిక తెలంగాణ ఉద్య‌మ కారులు కోరారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని తాండూరు ఉద్య‌కారులు ప్ర‌కాష్ గౌడ్, జిలాని, ద‌త్తాత్రేయ త‌దిత‌రులు కలిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌లో ఉద్య‌మ‌కారుల‌కు ఇండ్లు క‌ట్టించి ఇప్పించి న్యాయం చేయాల‌ని కోరారు. అదేవిధంగా టీఆర్ఎస్ ఉద్య‌మ కారుల‌కు నామినేటేడ్ ప‌ద‌వుల్లో అవ‌కాశం క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ డిమాండ్ల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కారం అయ్యేలా చూస్తాన‌ని హామి ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉద్య‌మ‌కారులు నాగేంద‌ర్, కేశ‌వులు, భాను, వాజిత్, మోయిజ్, ఆబేద్ చావుస్, ప్ర‌శాంత్‌గౌడ్, రామ‌కృష్ణ‌, ఖాశిం పాష త‌దిత‌రులు ఉన్నారు.