జాబ్ మేళాతో ఉద్యోగ అవకాశాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

జాబ్ మేళాతో ఉద్యోగ అవకాశాలు
– తాండూరులో కార్యక్రమమాన్ని జయప్రదం చేయాలి
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
– సీఎం సంకల్పం మేరకు మెగా జాబ్ మేళా
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఈనెల 29న తాండూరులో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాపై జిల్లా కలెక్టరేట్ లో సమన్వయ కమిటి సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ మెళాలతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. తెలంగాణ ఉపాధి కల్పన మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం) సహాకారంతో ఎల్లుండి గురువారం తాండూరులోని వినాయక కన్వెన్షన్ హాల్ లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 52 కంపెనీలతో 11 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో మౌళిక వసతులు కల్పించాలన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికి ఉద్యోగాలు కల్పించాలని సంకల్పం స్ఫూర్తితో తాండూరులోని వినాయక కన్వెక్షన్ హాల్ లో ఎల్లుండి గురువారం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి జాబ్ మెళాలలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో ఎందరికో మేలు జరుగుతుందన్నారు. జాబ్ మేళాను జయప్రదం చేసేందుకు అందరు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, ఈజీఎంఎం ఈడీ కృష్ణన్. జేడీఎం సతీష్, తాండూరు సీడీపీఓ శ్రీలత, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఉపాధి కూలి మృతి