అనారోగ్యంతో వేగలేక..!
– రైలుకిందపడి యువకుడి ఆత్మహత్య
– తాండూరు పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్య సమస్యలో వేగలేక ఓ యువకుడు జీవీతంపై విరక్తి చెంది రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం ఉదయం తాండూరు పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వి.సుమన్(24) గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. శనివారం ఉదయం తాండూరు పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జీ సమీపంలోని రైల్వే పట్టాలపై గుర్తుతెలియని రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను పరిశీలించారు. మృతుని వద్ద లభించిన ఆధారాలతో, తెలిసిన వారి ద్వారా మల్కాపూర్ గ్రామానికి చెందిన సుమన్ గా గుర్తించారు. కుటుంభీకులకు సమాచారం అందించారు. జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంభీకులకు అందజే శారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

