కేసీఆర్ పై కుట్రలు పారవు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కేసీఆర్ పై కుట్రలు పారవు..!
– కాంగ్రెస్, బీజేపీలవి కక్ష్య సాధింపే
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– కేసీఆర్‌కు కేటీఆర్‌తో కలిసి సంఘీభావం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ మాజీ సీఎం. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన పారవని తాండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. కాలేశ్వరం కమీషన్ ఎదుటకు విచారణ నిమిత్తం హాజరైన మాజీ సీఎం కేసీఆర్ కు సంఘీభావం తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెళ్లారు.

రోహిత్ రెడ్డితో పాటు తాండూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులతో భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అంచలమైందని అన్నారను. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రజలకు మేలు చేశారని అన్నారు. గతంలో నాయకులు అధికారం కోసం పనిచేస్తే కేసీఆర్ ప్రజల జీవితాలను మార్చేందుకు కృషి చేశారని అన్నారు. కాళేశ్వరంపై కేసీఆర్ చేసిన కృషిని, ఘనతను ఎవ్వరు తుడిచి పెట్టలేరని అన్నారు.

తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు శ్రీరామ రక్షగా నిలుస్తాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన పారవని అన్నారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల అండదండలు ఉంటాయని అన్నారు. మరోవైపు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, విజయ్ కుమార్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, లింగారెడ్డి తదితరులు కూడా పాల్గొని కేసీఆర్ కు మద్దతు తెలిపారు.

ఇదికూడా చదవండి…

బర్త్‌డే పార్టీ కోసం వెళ్లిన ఫ్రెండ్స్..!