చిలుకవాగు నాలా వద్ద హైడ్రామా
– ఇటాచీతో తవ్వకాలకు మున్సిపల్ ఉపక్రమణ
– అభ్యంతరం తెలిపిన బీజేపీ నేతలు
– పాత కాలువ విధంగా తవ్వకాలు చేయాలని డిమాండ్
– సందర్శించిన మున్సిపల్, రెవెన్యూ, ఆర్అండ్ బీ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వరధ కష్టాల ఆరోపణలకు కేంద్రంగా మారిన చిలుక వాగు నాలా తవ్వకాల వద్ద హైడ్రామా ఏర్పడింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రెండు రోజుల క్రితం వరధ కష్టాలపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. చిలుక వాగు నాలా కబ్జాకు గురికావడంతో వరధ కష్టాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు.
మున్సిపల్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో చిలుక వాగులో పూడికలు. కబ్జాలు తొలగించి ప్రక్షాళన చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతో రెండు రోజుల నుంచి మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదిక తవ్వకాల పనులు చేపట్టారు. గురువారం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఇటాచీతో తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు బీజేపీ నేతలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్, కౌన్సిలర్ బాలప్ప, బీజేవైఎం నాయకులు అంతారం కిరణ్, జగదీష్ తదితరులు తవ్వకాలను పరిశీలించారు. అయితే చిలుకవాగు తవ్వకాలను తూతు మంత్రంగా చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

వాగు నాలా ఒక చోట ఉంటే మరో చోట నుంచి తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. అసలైన నాలా మార్గంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని వదిలేసి తవ్వకాలు చేపడుతున్నారని అన్నారు. వెంటనే సర్వే చేయించి చిలుకవాగు నాల ప్రవహించిన అసలైన మార్గంలో తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో తవ్వకాల వద్ద హైడ్రామా ఏర్పడింది. విషయం తెలుసుకున్న తాండూరు పట్టణ ఎస్ఐ కాశినాథ్, కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి, ఆర్అండ్ బీ డీఈ శ్రీనివాస్, తాండూరు, యాలాల రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
చిలువ వాగు నాలా సర్వే చేసి అ ప్రకారమే తవ్వకాలు చేసేలా చూస్తామని తెలపడంతో బీజేపీ నేతలు శాంతించారు. అనంతరం మున్సిపల్ అధికారులు తవ్వకాలను ప్రారంభించారు. సాయంత్రం వరకు తవ్వకాలు కొసాగాయి. శుక్రవారం తవ్వకాలు జరుగుతాయా.. ఆగుతాయాని వేచి చూడాలి.
ఇదికూడా చదవండి….

