సంఘ విద్రోహులు అనడం సరికాదు
– టీచర్‌కు వత్తాసు పలికిన వారిపై చర్యలు తీసుకోవాలి
– ఏబీవీపీ, హిందూ వాహిని సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం జెడ్పీ బాలికల పాఠశాల సంఘటనపై ఆందోళన చేపట్టిన వారిని సంఘ విద్రోహ శక్తులు, అల్లరి మూకలు అని వాఖ్యలు చేయడం సరికాదని ఏబీవీపీ, హిందూ వాహిని సభ్యులు అన్నారు.

శనివారం ఏబీవీపీ, హిందూ వాహిని సభ్యులు మాట్లాడుతూ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ టీచర్ విద్యార్థులు ఆవు మెదడు చూపిస్తూ పాఠం చెప్పడం పట్ల ఈనెల 25వ తేదిన ఏబీవీవీ, హిందూ వాహిని, గ్రామస్తులు, పలు సంఘాలు శాంతియుతంగా ఆందోళన చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. ఈ సంఘటనపై పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి చర్యలు తీసుకున్నారని తెలిపారు. దీనిపై కొందరు సైన్స్ టీచర్ కు అనుకూలంగా మద్దతు ఇస్తూ ఏబీవీపీ, హిందూ వాహినీ, గ్రామస్తులు, నాయకులను సంఘ విద్రోహ శక్తులు, అల్లరి మూకలు అంటూ వాఖ్యలు చేయడాన్ని ఖండించారు.

టీచర్ కు వత్తాసు పలుకుతూ వాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహినీ రాష్ట్ర నాయకులు రాము సాగర్, వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్, సభ్యుఉల గణేష్, భరత్, చంద్రశేఖర్, విశాల్, మధు, శ్రావణ్, సాయి, కార్తిక్, ఏబీవీపీ పట్టణ అధ్యక్షులు నర్సింలు, నగర కార్యదర్శి చేతన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్, నాయకులు చందు, రఘు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

