ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు పక్కా ఇళ్లు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు పక్కా ఇళ్లు
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో అభివృద్ధి
– కొత్లాపూర్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు పక్కా ఇళ్లు అందుతున్నాయని తాండూరు మండల కాంగ్రెస్ నేతలు అన్నారు. బుధవారం తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామంలో మల్కాపూర్ గనికార్మిక సంఘం డైరెక్టర్ కోతి గోపాల్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్దిదారులతో కలిసి భూమిపూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు.

మండల పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్పతో పాటు కోతి గోపాల్ పలువురు నాయకులు పూజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు పక్కా ఇళ్లు వస్తున్నాయన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో గ్రామంలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. అర్హులైన పేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తం రెడ్డి, యువనాయకులు జగదీష్, మల్కాపూర్ గనికార్మిక సంఘం డైరెక్టర్ కోతిగొ పాల్, కొత్లాపూర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయ చైర్మన్ నవీన్ రెడ్డి, తాండూరు ఎంపీడిఓ విశ్వ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, స్థానిక నేతలు బస్వరాజ్ గౌడ్, రాజయ్య, శాంతప్ప, మైబూబ్ పాష, చెవిటి పాండు, మేకల నర్సింలు, కోతి పండరి, శంషోద్దీన్, ఇందిరమ్మ కమిటి సభ్యులు రాజేశ్వరీ, ప్యారీ భేగం, కుర్వ మల్లప్ప, వంసత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

స్పూర్తిదాయకుడు వనజీవి రామయ్య