గొరింటాకులో ఔషధగుణాలు..!
– అందం..ఆరోగ్యాన్ని కాపాడే సైన్స్
– మశూచికమును తరిమేసే మందు
– చర్మ, జుట్టు సమస్యలకు పరిష్కారం
దర్శని డెస్క్ : గోరింటాకు భారతీయ సంప్రదాయాల్లో ప్రత్యేకమైన స్థానం కలిగిన ఔషధ మొక్క. ఇది ముఖ్యంగా మహిళలు చేతులకు, కాళ్లకు అలంకారంగా పెట్టుకునే సంప్రదాయం. పెళ్లిళ్లు, వ్రతాలు, పండుగలు వంటి శుభకార్యాల్లో గోరింటాకు పెట్టడం శుభదాయకంగా భావిస్తారు. గోరింటాకు ఆకుల్లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండటంతో చర్మవ్యాధులు, గాయాలకు ఇది సహజ చికిత్సగా పనిచేస్తుంది. గోరింటాకు వాడకానికి మౌలికంగా ఆరోగ్య పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికత, సాంస్కృతిక విలువలూ ఉండటం విశేషం.

గోరింటాకును సంస్కృతంలో నఖరంజని అని అంటారు. నఖరంజని అంటే గోళ్లకురంగు కలిగించేది అని అర్థం. గోరింటాకు అనే తెలుగు పేరు కూడా ఇదే అర్థాన్నిస్తుంది. గోరింటాకును చేతి వేళ్ళకు, గోళ్ళకు, అర చేతులకు, పాదాలకు, అరి పాదాలకు, కాళీ గోళ్ళకు, కొందరు నుదిటి మీద బొట్టు పెట్టుకునే చోట పెట్టుకుంటారు. ఇన్ని చోట్ల పెట్టుకునేది అయినా గోర్లకు పెట్టుకునేది గానే గుర్తిస్తారు.

ఎప్పుడు ఇంటిపని, వంట పనిలో నిమగ్నమైన ఆడవారు వారి వాళ్ల చేతులలో మన్ను, దుమ్ము, రోగకారక క్రిములు చేరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్ళ వేళ్ళ సందులలో కూడా చర్మం పగిలి చెడుతుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వాటిని అంటిపెట్టుకుని ఉండే విష క్రిములు నశిస్తాయి. అవి పిప్పి గోళ్లు కాకుండా కాపాడుతుంది.

గోరింటాకు చెట్టు ఆకులు, పట్ట, పువ్వులు, గింజలు అన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. గోరింటాకులో ఒక విధమైన చిరువిషం ఉంటుంది. ఇందులో “హెన్నా టానిస్ యాసిడ్” ఉంటుంది. అందుకనే దీని రుచి ఒక రకమైన చేదును కలిగిస్తుంది. గోరింట పువ్వులతో అత్తరు, సువాసన నూనె తయారు చేస్తారు. ఈ పువ్వుల నుండి బట్టీ పట్టిన నీటిని యూదులు స్నానానికి ఉపయోగించే వారు. గోరింట పువ్వులతో నింపిన గుడ్డ సంచిని తలగడగా అంటే దిండుగా పెట్టుకుంటే నిద్ర త్వరగా వస్తుంది.

ఆకునూరినా ముద్దలో నిమ్మరసం కలిపి అరికాళ్లకు పట్టిస్తే కాళ్ళ మంటలు మొదలగునా బాధలు తగ్గుతాయి. గోరింటాకులు నూరిన ముద్దలో నూని తెల్లగుగ్గీలము కలిపి నుదుటికి పెట్టుకుంటే తలనొప్పులు తగ్గుతాయి. ఈ మందును మశూచికము మొదలైన అమ్మవార్లు కనిపించిన వాళ్ళ పాదాలకు పట్టిస్తే వాళ్ళ కళ్ళల్లో అమ్మవారు పోయదని అంటారు.

గోరింట నూరిన గుజ్జులో నీలిమందు వేసి వెంట్రుకలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగానూ, వెంట్రుకలు బాగా పెరగడానికి తోడ్పడుతుంది. అలాగే గోరింటాకు రసం కొబ్బరి నూనెలో కలిపి తలకు మర్దన చేస్తే జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకుల నుండి తయారు చేసిన ముద్ద గాయాలను కురుపులను మాన్పుతుంది.
ఈ ఆకుల కషాయంతో కాపడం పెడితే బెణుకు నొప్పులు, వాపులు తగ్గుతాయి. పై విషయాల వల్ల గోరింటాకు గొప్ప ఔషధ గుణాలు గల మొక్కగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇది చర్మ రోగాలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది .ఇప్పుడు గోరింటాకు పెట్టుకోవడం మోటుగా అనిపిస్తుంది.
వర్షఋతువుకు చెందిన భాద్రపదమాసంలో ఉండ్రాళ్ళతద్ది నడి-వర్షాకాలపు పండగ, శరదృతువు కు చెందిన అశ్వయుజ మాస మాధ్యమంలో వచ్చే అట్లతద్ది చివరి పండుగ. ఈ మూడు సందర్భాల్లో గోరింటాకు పెట్టుకుని తమ ఆరోగ్యం, అందం కాపాడుకునే ఆచారం ఇట్లా పండుగల కార్య విధానంలో మన పెద్దలు మేళవించి చెప్పినారు.

ఇదికూడా చదవండి…

