పరిహారం తేల్చకుండ.. ఇళ్లు కూల్చకండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పరిహారం తేల్చకుండ.. ఇళ్లు కూల్చకండి..!
– జాతీయ రోడ్డులో నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేయండి
– తాండూరు సబ్ కలెక్టర్‌కు కోటబాస్పల్లి గ్రామస్తుల విజ్ఞప్తి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : జాతీయ రోడ్డు పనుల్లో భాగంగా కూల్చివేతకు గురయ్యే మా ఇళ్లకు నష్టపరిహారం తేల్చి బాధితులకు న్యాయం చేయాలని తాండూరు సబ్ కలెక్టర్ ను మండలంలోని కోటబాస్పల్లి గ్రామస్తులు కోరారు.

బుధవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ను గ్రామస్తులు కలిసి వినతి పత్రం అందించారు. తాండూరు మండలం కోటబాస్పల్లి మీదుగా చేపడుతున్న 167 జాతీయ రోడ్డు పనుల్లో భాగంగా పలువురు ఇళ్లు పూర్తిగా, లేదా పాక్షికంగా కూల్చివేసే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. కూల్చివేస్తున్న ఇళ్లకు అధికారులు ఎలాంటి నష్టపరిహారం ప్రకటించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు కోసం ఇళ్లను కూల్చివేస్తే రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేధన తెలిపారు. జీవనోపాధికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు.

కూల్చివేస్తున్న మా ఇళ్లకు నష్టపరిహారం నిర్ణయించి ప్రకటించాలన్నారు. అన్యాయంగా ఇళ్లను కూల్చకుండా చూడాలని, ఇళ్లు కోల్పోతున్న వారిని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందించిన వారిలో గ్రామస్తులు గురుచరణ్ రెడ్డి, చంద్రారెడ్డి, మొగులప్ప, శేఖర్ గౌడ్, నాగార్జున, బాస్కర్, కుర్వ మల్కప్ప, వడ్డె బాలరాజ్, వడ్డె రాజు, వడ్డె వెంకటయ్య, అలకుంట్ల సురేష్, వడ్డె హన్మంతు, కృష్ణవేణి, డీకే వెంకటేష్, అశోక్ గౌడ్, నిజాం, అవుసుల శ్రీహరి, కుర్వ భీమమ్మ, ఎండీ దావుద్, ఎండీ యూనుస్, చాకలి రవి, అవుసుల రాములు, అవుసుల ఈశ్వరయ్య, పాలేపల్లి నాగేంద్రమ్మ, సుధాకర్, కళావతి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి మరింత చొరవ చూపాలి