రేపటి స్వాగత ర్యాలీని జయప్రదం చేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపటి స్వాగత ర్యాలీని జయప్రదం చేయండి
– బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు తాండూరుకు వస్తున్న సమాచార, గనుల భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలకు స్వాగత ర్యాలీని జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) అన్నారు. మంత్రిగా బాధ్యతగా చేపట్టిన తరువాత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కించుకున్న తరువాత పైలెట్ రోహిత్ రెడ్డి తొలిసారి రేపు తాండూరుకు వస్తున్న తరుణంలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి, ఎమ్మెల్యేతో పాటు చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలను స్వాగతించేందుకు 10 వేల మందితో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని విలియమూన్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. అనంతరం పట్టణంలోని రైల్వే స్టేషన్ చౌరస్తా వద్ద సన్మాన సభను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండలంలో భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున ఈ ర్యాలీకి, సభకు ప్రజా ప్రతినిధులు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!