శ్రీ‌సాయిపుత్ర హోమ్స్‌లో వైభ‌వంగా ల‌క్ష్మీపూజ‌

తాండూరు వికారాబాద్

శ్రీ‌సాయిపుత్ర హోమ్స్‌లో వైభ‌వంగా ల‌క్ష్మీపూజ‌
– స‌తీస‌మేతంగా పూజ‌లు నిర్వ‌హించిన శంక‌ర్ యాద‌వ్
– హాజ‌రైన నాయ‌కులు, స‌న్నిహితులు, వ్యాపారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలోని ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి భావ‌నోళ్ల శంక‌ర్ యాద‌వ్‌కు చెందిన శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవ‌ల‌ప్స్ కార్యాల‌యంలో ఆదివారం ల‌క్ష్మీపూజ వైభ‌వంగా జరిగింది. దీపావ‌ళి,కార్తీక మాసం సంధ‌ర్భంగా కార్యాల‌యంలో శంక‌ర్ యాదవ్ త‌న స‌తీమ‌ణి చంద్ర‌క‌ళ‌తో కుటుంబ స‌మేతంగా ల‌క్ష్మీపూజ భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో నిర్వ‌హించారు. వేద పండితుల మంత్రోచ్ఛ‌ర‌ణ మ‌ద్య శంక‌ర్ యాద‌వ్ ల‌క్ష్మీపూజ‌ను పూర్తి
చేయించారు. వ్యాపారంలో అన్ని విధాలుగా వృద్ధి సాధించేలా చూడాల‌ని ల‌క్ష్మీదేవిని వేడుకున్నారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో శంక‌ర్ యాద‌వ్ స‌న్నిహితులు, తాండూరుకు చెందిన ప‌లువురు నాయ‌కులు, వివిధ సంఘాల ప్ర‌తినిధులు, ప్ర‌ముఖ వ్యాపారులు పాల్గొన్నారు.